కరోనా దెబ్బకు మరో ఇద్దరు పోలీసులు మృతి

కరోనా మహమ్మారి విలయతాండవం ఇంకా తగ్గడం లేదు. ముఖ్యంగా ముంబై నగరాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే వందలాది మంది మరణించగా..తాజాగా మరో ఇద్దరు పోలీసులు ప్రాణాలు విడిచారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 29,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1,068 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముంబయిలో కరోనా అలజడి సృష్టిస్తోంది. కరోనాతో ఇద్దరు ఏఎస్‌ఐలు చనిపోయారు. 57 ఏళ్ల అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శుక్రవారం కరోనాతో మృతి చెందాడు. మరో ఏఎస్‌ఐకి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నాడు. అతను బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు.