25 నుంచి దేశీయ విమానాలు షురు


దేశీయ విమాన సేవలు పునర్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలను నడిపించడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దశలవారీగా సర్వీసులు పునరుద్ధరిస్తామని డీజీసీఏ తెలిపింది.

25 నుంచి విమాన సర్వీసులను నడిపేలా సిద్ధమవ్వాలని ఎయిర్‌పోర్టులు, విమాన సంస్థలకు సమాచారం అందించారు. దీనికి సంబంధించిన ప్రామాణిక నిబంధనలను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు.