ఏపీ సచివాలయం ఉద్యోగులు ఇక ఆఫీస్ కి రండి


అమరావతిలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం ప్రభుత్వం వర్క్‌ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేసింది. రెండు బృందాలుగా విభజించి ఒక్కో వారం ఒక బృందానికి విధులు అప్పగించాలని కోరిన విషయం తెలిసిందే. తాజాగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విధులకు హాజరుకావాలని, వారికోసం ప్రజా రవాణా వ్యవస్థ సమకూర్చనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఇదీలావుంటే రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 647కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 26, కృష్ణాలో 6, తూర్పు గోదావరిలో 5, అనంతపురంలో 3, గుంటూరులో 3, విశాఖపట్నంలో ఒక కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి బులెటిన్‌లో వెల్లడించారు.