ఏపీ వైద్య మంత్రి అటెండర్‌కు పాజిటివ్


ఆంధ్రప్రదేశ్‌లో .. రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం కలకలం సృష్టిస్తూండగానే.. ఇప్పుడు… సచివాలయానికి వైరస్ సోకింది. వైద్య ఆరోగ్య మంత్రి పేషీలో అటెండర్‌గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దాంతో అతన్ని ఐసోలేషన్‌కు పంపారు. వెంటనే ఆరోగ్య మంత్రితో పాటు అటెండర్ సేవలు అందుకున్న పలువురికి ర్యాపిడ్ టెస్టులు చేసి…నెగెటివ్‌గా వచ్చిందని ప్రకటించారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,727 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా 73 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.