ఏపీలో పెరుగుతున్న కేసులు.. కంట్రోల్ తప్పిన జనాలు


ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటి వరకూ 524 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1093 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు. కరోనా ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. ఇప్పుడు ఇలా జనాలు గుమిగూడటం ఆందోళ కరంగా వుంది.