ఏపీలో మరో 67 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 67 కేసులు నమోదు అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలోనే 25 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. గుంటూరు(19), కృష్ణా(12), విశాఖ(6), కడప(4), చిత్తూరు జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఈ 67 కేసులతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,650కు చేరింది. ఇప్పటి వరకూ 33 మంది కరోనా వల్ల చనిపోయారు. సోమవారం ఉదయం వరకు 524 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 1,093 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.