
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి చేరాయి. మొదట్లో కాస్త తక్కువగా నమోదు అయినప్పటికీ ఆ తర్వాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు కావడం మొదలయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇవాళ ఉదయం 10 గంటలకు ఏపీ కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ విడుదల చేసిన బులెటిన్ 135 ప్రకారం… 61 కొత్త కేసులు నమోదు కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కు చేరింది. ఇప్పటి వరకు 171 మంది డిశ్చార్జ్ కాగా.. 31 మంది మృతిచెందారు.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 814 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
జిల్లాల్లో చూస్తే… 275 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా… 209 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జిల్లాలపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తోంది. అలాగే… కృష్ణా జిల్లాలో విజయవాడలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటం సవాలుగా మారింది.









