ఏపీలో కొత్త కేసులు 33

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో 33 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2051కి చేరింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 58 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1056కి చేరింది. ప్రస్తుతం 949 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.