
ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో .. ఇప్పటి వరకు ఆహారాన్ని మాత్రమే అందించిన ఈ సంస్థలు తాజాగా ఆల్కహాల్ ను కూడా అందించేందుకు సిద్ధమయ్యాయి. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే అన్ని రాష్ట్రాల్లో లిక్కర్ అమ్మకాలు పునఃప్రారంభమయ్యాయి.
దీంతో, వైన్ షాపుల వద్ద పెద్ద క్యూలు, పోలీసుల లాఠీ ఛార్జీలు వంటివి చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాల చర్చ తెరపైకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆన్ లైన్ అమ్మకాలు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ క్రమంలో స్విగ్గీ, జొమోటాలు లిక్కర్ డెలివరీని ప్రారంభించాయి.









