
కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతలం చేస్తోంది. సామాన్యుల నుంచి రాజకుటుంబీకుల వరకు ఈ వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. ఇది వరకే స్పెయిన్ రాజకుటుంబానికి చెందిన యువరాణి మరియా థెరిసా కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా బెల్జియం రాజవంశానికి చెందిన ప్రిన్స్ జొవాచిమ్ కొవిడ్-19 బారినపడినట్లు ఆ దేశ రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది. 28 ఏళ్ల జొవాచిమ్ ఇంటర్న్‌షిప్ కోసం ఈ నెల 24న బెల్జియం నుంచి స్పెయిన్‌కి వెళ్లారు. అక్కడ రాజకుమారుడిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అనంతరం కొవిడ్ పరీక్షల్లో అతనికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.









