
ఏపీలో కరోనా తీవ్రత తగ్గడంలేదు. కొత్త కేసుల్లో అధికంగా నమోదవుతున్నాయి. వైరస్ అంతకంతకూ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో మృతుల సంఖ్య 34కి చేరింది. నేడు నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 25 కేసులు ఉన్నాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 516కు చేరుకున్నాయి.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,263 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1717కి చేరింది.









