తెలంగాణలో మళ్ళీ కేసులు


తెలంగాణలో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 22 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 1038కి చేరింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగా కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ కీలక భేటీ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం 3 వరకు, రాష్ట్ర ప్రభుత్వం 7 వరకు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో 7తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.