తెలంగాణలో కొత్తగా 40 కేసులు


తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,454కి చేరింది. ఈ రోజు కొత్తగా 40 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 13 మంది డిశ్చార్జి కాగా… మొత్తంగా ఇప్పటివరకు 959 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటివరకు 34 మంది చనిపోగా, 461 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 33 జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాగా, మిగిలిన ఏడుగురు వలసదారులు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామన్నారు.