
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 75 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 722కి పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో పోరాడి 92మంది డిశ్చార్జి కాగా, 20మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 610మంది చికిత్స పొందుతున్నారు.
కాగ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముస్లిం మత పెద్దలతో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇళ్లలోనే చేసుకున్నారని గుర్తు చేసిన జగన్ . రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అందరికీ చెప్పాలని మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.









