ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృభిస్తుంది . గడచిన 24 గంటల్లో 6,552 శాంపిల్స్‌ పరీక్షించగా 80 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 893కు చేరింది.

కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. గడచిన 24 గంటల్లో 21 మంది కొవిడ్‌ బాధితులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 725 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగ లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను సముద్రమార్గం ద్వారా తరలించాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.