తెలంగాణలో మరో 55 కేసులు

తెలంగాణలో ఇవాళ మరో 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1509కి చేరింది. తాజాగా వచ్చిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 నమోదయ్యాయి. ఇవాళ మరో 12 మంది డిశ్చార్జి అయ్యారని,

దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 971కి చేరిందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 504 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 మంది మరణించారు.