
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,256 నమూనాలు పరీక్షించగా 36 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,100కి చేరింది.
కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1192 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతున్నారు.









