
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 1,98,706 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 97,581 ఉండగా, 95,526 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 204 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5,598కి పెరిగింది.









