భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో భారత్‌ విలవిల్లాడుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా రికార్డుస్థాయిలో 8380పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు దేశంలో 8వేలకుపైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 182,143కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

అంతేకాకుండా దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 5164కి చేరింది. వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 86,984 మంది కోలుకొని డిశ్చార్జి కాగా మరో 89,995మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.