
ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేకుండా నెట్టుకొచ్చిన సిక్కిం ఇవాళ మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు చేసింది. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్ష నిర్వహించారు. సిక్కింలో ఇప్పటివరకు కరోనా పరీక్ష కేంద్రాలు కూడా లేవు.
సిక్కిం… చైనా, భూటాన్ లతో సరిహద్దులు కలిగివుంది. అయినప్పటికీ ఇప్పటివరకు కరోనా ముప్పు నుంచి సమర్థంగా కాచుకుందని చెప్పాలి.









