దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24గంటల్లో కొత్తగా 1684 కేసులు నమోదు కాగా; 491మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో రికవరీ రేటు 20.57 శాతంగా ఉందని ఆ శాఖ సంయుక్త కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు. గత 28 రోజుల్లో 15 జిల్లాల్లో; అలాగే 14 రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదని చెప్పారు.
కాగ ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లీ హైన్ లూంగ్‌తో నిన్న ఫోన్లో మాట్లాడినట్టు పీఎంవో వెల్లడించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇరువురు నేతలు ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై పరస్పరం చర్చించుకున్నట్టు తెలిపింది.









