
తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కాగ భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 2411 కొత్త కేసులు 71 మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 37,776 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకినవారిలో 10018 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1223 మంది మృతిచెందారు
