తెలంగాణలో కొత్తగా 17 కేసులు

తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగ భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో 2411 కొత్త కేసులు 71 మరణాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 37,776 మందికి ఈ వైరస్‌ సోకినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ సోకినవారిలో 10018 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1223 మంది మృతిచెందారు