‎జూబ్లీహిల్స్ రోడ్ల పైకి చిరుత..

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఏ ఒక్కరు కూడా రోడ్ల పైకి రావడం లేదు. అలాగే రవాణా వ్యవస్థ సైతం ఆగిపోవడం తో రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో జంతువులు అడవులను వదిలిపెట్టి రోడ్ల పైన స్వేచ్ఛ గా తిరుగుతున్నాయి.

ఇప్పటికే పలు నగరాల రోడ్ల ఫై పులులు కనిపించగా..ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ల పైకి చిరుత సంచరించడం అందర్నీ షాక్ కు గురిచేస్తుంది. నగర నడిబొడ్డున చిరుత కనిపించడం నగరవాసులను ఆశ్చర్యానికి అలాగే షాక్ కు గురి చేస్తుంది. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా కేబీఆర్ పరిసరాలలో సంచరిస్తున్న చిరుతని తన కెమెరాలో బంధించాడు. మెల్లగా రోడ్డు పైకి వచ్చిన చిరుత పులి అటు ఇటు గమనిస్తూ డివైడర్ దాటింది. ఏప్రిల్ 18 తెల్లవారుఝామున తీసిన వీడియో ఇది అని అభిషేక్ తన ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.