తెలుగు ప్రజలకు కూల్ చేసే వార్త

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేకపోయారు. ఇక ఇప్పుడు ఎండ దెబ్బకు ఇంట్లో నుండి అడుగు బయటకు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ ఓ చల్లని కబురు తెలిపింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

మూడు రోజులపాటు ఎండలు ఉండే అవకాశం ఉందని.. మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలియజేసింది. మే 27 వ తేదీన దక్షిణ బంగాళాఖాతంలో అండమాన్ ప్రాంతంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని , వాతావరణంలో తేమ తగ్గిపోవడంతో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని అంటున్నారు.