
కరోనా వైరస్ కారణంగా చాల దేశాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని సంస్థలు , అన్ని రంగాల వారు నష్టపోతుంటే..యూట్యూబ్ , OTT సంస్థలు మాత్రం లాభాలు అందుకుంటున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ కి ఒక్కసారిగా సబ్ స్క్రైబర్స్ పెరిగిపోయారు. ఊహించని రీతిలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ రెవెన్యూ పెరుగుతోంది. అలాగే యూట్యూబ్ చానెల్స్ కు కూడా డిమాండ్ పెరిగిపోయింది.

ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రత్యేకంగా వంటల ఛానెళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న చాలామంది యూట్యూబ్ లో వంటల పాఠాలు నేర్చుకుంటున్నారు. శ్రీవారికి కొత్త వెరైటీ చేసి పెట్టాలనుకున్న వారు, శ్రీమతికి తన చేతివంట రుచి చూపించాలనుకున్నవారు.. అందరూ యూట్యూబ్ కి శిష్యులుగా మారిపోతున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు.. ఇలా అన్ని భాషల వంట వీడియోలకు మంచి డిమాండ్ వచ్చేసింది. ముఖ్యంగా తెలుగులో కుకరీ ఛానెళ్లు నడుపుతున్న వారంతా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. సబ్ స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగిపోతోంది. డౌన్ లోడ్లు, వ్యూస్ ఎక్కువగా ఉండటంతో.. వారికి రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. మొత్తం మీద యూట్యూబ్ ను నమ్ముకున్న వారికీ కవర్ణ కలిసొచ్చింది.









