
మనుషులకే కాదు కుక్కలకు కూడా కరోనా టెస్టులు చేయాలనీ కోరుతున్నారు స్థానికులు..ఈ ఘటన ఎక్కడంటే జోగుళాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామంలో. గ్రామంలో కొన్ని కుక్కలు వింతగా ప్రవర్తిస్తుండటంతో కోవిడ్-19 సోకిందని స్థానికులు అనుమానించారు. గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పశుసంవర్ధ శాఖకు చెందిన మెడికల్ టీమ్ గ్రామానికి చేరుకొని.. కుక్కల నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వాటికి కరోనా సోకలేదని స్పష్టం చేశారు.
గ్రామ సమీపంలోని కోళ్ల వ్యర్థాలను తిని కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయని.. అంతేగానీ వాటికి కరోనా వైరస్ సోకలేదని డాక్టర్ రాజేశ్ వెల్లడించారు. వాటికి రోగ నిరోధక టీకాలు వేశామని ఆయన పేర్కొన్నారు.









