Site icon TeluguMirchi.com

కరోనా పనిపట్టే వ్యాక్సిన్ రాబోతుంది..

Coronavirus software

కరోనా ఈ పేరు చెపితే చాలు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. చైనా నుండి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాల ప్రజలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. ఈ వైరస్ తాకిడికి మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఈ కరోనా దాటికి చనిపోవడం..లక్షల సంఖ్య చికిత్స తీసుకోవడం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ కరోనా పనిపట్టే వ్యాక్సిన్ ను చైనా లో తయారు చేసారు. ప్రస్తుతం రెండు, మూడో ట్రయల్స్​ జరుగుతున్నాయి. సెప్టెంబర్​ నాటికల్లా వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చైనా సెంటర్​ ఫర్​ డిసీజ్​ ప్రివెన్షన్​ అండ్​ కంట్రోల్​ (సీడీసీ) చీఫ్​ డాక్టర్​ గావ్​ ఫు చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల్లో మాత్రమే వ్యాక్సిన్​ను ఇస్తామని చెప్పారు. నిజానికి వ్యాక్సిన్​కానీ, మందుగానీ తయారు చేయాలంటే టైం పడుతుందని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా వ్యాక్సిన్​ను తయారు చేస్తున్నామని, ట్రయల్స్​ జరుగుతున్నాయని ఆయన అన్నారు. మళ్లీ కరోనా తిరగబెడితే ఈ వ్యాక్సిన్​ను ఎమర్జెన్సీ మందుగా వాడతామన్నారు. అది కూడా అందరికీ ఇవ్వబోమన్నారు. కేవలం డాక్టర్లు, మెడికల్​ వర్కర్లకు ముందుగా వాడతామన్నారు. అందరికీ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుతుందన్నారు.

Exit mobile version