
కరోనా ఈ పేరు చెపితే చాలు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. చైనా నుండి వచ్చిన ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాల ప్రజలను నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. ఈ వైరస్ తాకిడికి మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో ఈ కరోనా దాటికి చనిపోవడం..లక్షల సంఖ్య చికిత్స తీసుకోవడం జరుగుతుంది.
ప్రస్తుతం ఈ కరోనా పనిపట్టే వ్యాక్సిన్ ను చైనా లో తయారు చేసారు. ప్రస్తుతం రెండు, మూడో ట్రయల్స్ జరుగుతున్నాయి. సెప్టెంబర్ నాటికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా చైనా సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సీడీసీ) చీఫ్ డాక్టర్ గావ్ ఫు చెప్పారు. ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల్లో మాత్రమే వ్యాక్సిన్ను ఇస్తామని చెప్పారు. నిజానికి వ్యాక్సిన్కానీ, మందుగానీ తయారు చేయాలంటే టైం పడుతుందని, కానీ, ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వేగంగా వ్యాక్సిన్ను తయారు చేస్తున్నామని, ట్రయల్స్ జరుగుతున్నాయని ఆయన అన్నారు. మళ్లీ కరోనా తిరగబెడితే ఈ వ్యాక్సిన్ను ఎమర్జెన్సీ మందుగా వాడతామన్నారు. అది కూడా అందరికీ ఇవ్వబోమన్నారు. కేవలం డాక్టర్లు, మెడికల్ వర్కర్లకు ముందుగా వాడతామన్నారు. అందరికీ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుతుందన్నారు.









