తెలంగాణ ప్రజలకు కరోనా తీపి కబురు

గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా వైరస్..బుధువారం కాస్త తగ్గుముఖం పట్టింది. గత పదిహేను రోజులుగా ఏ ఒక్క రోజూ పదికి లోపు కేసులు నమోదు కాలేదు. బుధువారం కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదు కావడం తో అధికారులు , డాక్టర్స్ హమ్మయ్య అనుకున్నారు. అలాగే ఇవాళ 8 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

తెలంగాణలో ఇప్పటి వరకు 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 118 మంది కోలుకోగా 18 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 514 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 514 యాక్టివ్ కేసులుంటే.. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 267 మంది బాధితులున్నారు. అంటే ఇప్పుడున్న కేసుల్లో సగానికి పైగా హైదరాబాదీలే. మరోపక్క కేసీఆర్ కూడా లాక్ డౌన్ ను పొడిగించి ఈ రెండు వారాలు ప్రజలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని..లాక్ డౌన్ కు సహకరించాలని కోరుతున్నారు.