కరోనా కాలర్ ట్యూన్ వాయిస్ ఈమెదే..

ప్రస్తుతం ఫోన్ చేస్తే చాలు ..వెంటనే వినిపించేది కరోనా గురించే..ఈ కరోనా వాయిస్ ఎవరిదో అని అంత మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్వరం ఎవరిదన్నది గోప్యంగా ఉన్న తాజాగా అది ఎవరిదీ అనేది బయటపడింది. దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన ఇద్దరు ఓయిస్ ఓవర్ ఆర్టిస్టులతో ఈ కాలర్ ట్యూన్లను రికార్డు చేశారు. దేశంలో కరోనా కలకలం మొదలైన మార్చి మొదటి వారంలో కాలర్ ట్యూన్లలో మొదట దగ్గు వినిపించి తర్వాత ఓ స్వరం వినిపించేది కదా అది దక్షిణ కన్నడ జిల్లాకి చెందిన జెస్సీకా ఫెర్నాండెజ్ తన వాయిస్ గా పెర్కొన్నారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఢిల్లీ స్టూడియో నుంచి తనకు ఫోన్‌ వచ్చినప్పుడు.. త్వరలోనే తన స్వరం కాలర్‌ ట్యూన్‌గా వినిపించబోతుందన్న సంగతి అంతగా తెలియదన్నారు. కొద్ది రోజుల తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నా స్వరం మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్‌గా వినిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే ఢిల్లీ స్టూడియోకి ఫోన్ చేసి నా పేరు వెల్లడించవద్దని కోరాను. పదే పదే నా స్వరం వింటే వినియోగదారులకు విసుగెత్తి ట్రోల్ చేస్తారని ఇన్నాళ్లూ దాచిపెట్టాను అంది జెస్సికా.