తె
లంగాణలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఆలస్య రుసుం లేకుండా మే 15 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్‌లతో పాటు పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తులకు గడువును పెంచుతున్నట్టు వెల్లడించింది.
కాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. ఈరోజు రాష్ట్రంలో 22 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 1038కి చేరింది.









