డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయి ..

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండడం తో డిజిటల్‌ చెల్లింపులు బాగా పెరిగినట్లు చెపుతున్నారు. గత మూడు వారాలుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. అన్ని రిఛార్జెస్ తో పాటు అన్ని బిల్లులు ఆన్ లైన్ లో చేస్తున్నారు. దీంతో గతంలో కంటే 42 శాతం డిజిటల్‌ చెల్లింపులు పెరిగినట్లు సమాచారం. ముఖ్యంగా నిత్యావసరాల కొనుగోళ్లు చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జ్‌లను ఆన్‌లైన్‌ ద్వారా ఎక్కువగా చేసినట్లు సర్వేలో తేలింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఏ షాపులో చూసినా ఇప్పుడు డిజిటల్ చెల్లింపులకు చెందిన యాప్‌లు ఉపయోగిస్తున్నారు.. బ్యాంకుల సమయం కూడా కుదించడంతో.. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో బ్యాంకులకు వెళ్లే సమయం కూడా లేకపోవడంతో.. ప్రజలు క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగించడం తో డిజిటల్‌ చెల్లింపులు ఇంకాస్త పెరగడం ఖాయం అంటున్నారు.