
దాదాపు 45 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడం తో మద్యం బాబులు పండగ చేసుకుంటున్నారు. ఇష్టపూర్తిగా మద్యం తాగుతూ కిక్ పెంచుకుంటున్నారు. కాగా తాజాగా మైలాడుదురై జిల్లా, శీర్గాళిలో మద్యం బాటిల్‌లో కప్ప కనిపించి మందు బాబుల కిక్ ను దించింది.
శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్ షాపు లో కొంతమంది శుక్రవారం సాయింత్రం మద్యం సీసాలను కొనుగోలు చేశారు. పొలంలోకి వెళ్లిన తర్వాత క్వార్టర్ బాటిల్ తెరిచి చూడగా.. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది. అది చూసి షాకై మద్యాన్ని కింద పారపోశారు. రమ్ బాటిల్లో కప్ప కనిపించిన సమాచారం టాస్మాక్ షాపు ఉద్యోగులకు తెలిసింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కకుండా వారి వద్ద నుంచి మద్యం సీసాను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. మద్యం సీసాలో కప్ప కనిపించడం గురించి జిల్లా టాస్మాక్ మేనేజర్ అంబికాపతిని ప్రశ్నించగా ఇంతవరకు తమ దృష్టికి ఈ సమాచారం అందలేదని, పూర్తిగా పరీక్షలు జరిపిన తరువాతే మద్యం బాటిళ్లను విక్రయాలకు అనుమతిస్తున్నస్తున్నట్టు చెప్పుకొచ్చారు.









