గౌతమ్ గంభీర్ గొప్ప మనసు చాటుకున్నాడు..ఏంచేసాడో తెలుసా..?

ప్రస్తతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండడం తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. విందులు , వినోదాలు ఇలా అన్ని ఆగిపోయాయి . చివరకు ఎవరైనా చనిపోయినాకని చూసేందుకు వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భారత ప్రపంచ కప్ విజేత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఓ పని చేసి వార్తల్లో నిలిచారు.

తన ఇంట్లో పనిచేస్తున్న ఒకరు మరణించితే ఒడిశాలోని ఆమె ఇంటికి పంపించలేకపోవడంతో గంభీర్ తానే స్వయంగా అంత్యక్రియలు జరిపించి తన ఉదారతను చాటుకున్నాడు. గత ఆరేళ్లుగా తన నివాసంలో పనిచేస్తున్న తన ఉద్యోగి సరస్వతి కొద్ది రోజుల క్రితం సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరింది. ఆమె మధుమేహం మరియు అధిక రక్తపోటుతో చాలా కాలం పాటు పోరాడుతోంది. అయితే ఏప్రిల్ 21 న చికిత్స పొందుతున్నప్పుడు ఆమె తుది శ్వాస విడిచింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆవిడ మృతదేహాన్ని తన స్వస్థలం అయిన ఒడిశాకు పంపించలేకపోవడంతో తానే చివరి కార్యక్రమాలు పూర్తి చేసాడు గంభీర్.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఓ పోస్ట్ చేసాడు. అందులో… “కులం, మతం, లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ నేను గౌరవాన్ని నమ్ముతాను. ఇదే మంచి సమాజాన్ని సృష్టించే ఏకైక మార్గం. ఇది భారతదేశం గురించి నా ఆలోచన! ఓం శాంతి” అని గంభీర్ అన్నారు.