జీహెచ్ఎంసీలోనే కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికులకు కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ తెలంగాణలో 33 కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తించారు.

ఏడుగురు వలస కార్మికులకు కూడా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఇక, తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1196కి పెరిగింది. ఇవాళ ఎవరూ డిశ్చార్చి కాలేదు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో 30 మంది మరణించారు.