దేశంలో తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం అదే

ఇండియాలో కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచింది గోవా. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే.. ఈ ఘనత డాక్టర్ల శ్రమ, కృషితోనే సంభవించిందని ఆయన అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “సున్నాకు ఎంతో విలువ ఉంది. గోవాలోని కొవిడ్-19 పాజిటివ్ కేసులన్నీ ఇప్పుడు నెగటివ్ అయ్యాయని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి, రోగులకు చికిత్సలు అందించి, వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు, వారితో కలిసి నడిచిన హెల్త్ వర్కర్లకు చాలా రుణపడివుంటాం” అని రాసుకొచ్చారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

కాగ గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,334 అని, 27 మంది మృతి చెందారని చెప్పారు. దీంతో, దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 15,712కి చేరిందని అన్నారు. ఇప్పటి వరకే ‘కరోనా‘ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,231 మంది కాగా, 507 మంది మృతి చెందారు.