ఆన్‌లైన్ ద్వారా ఇంటికే మద్యం…

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక నిన్నటి నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. కాకపోతే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మద్యం షాపుల వద్ద గుంపులు గుంపులుగా మద్యం ప్రియులు నిల్చోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రీన్‌ జోన్ల పరిధిలో ఆన్‌లైన్ ద్వారా మద్యం విక్రయాలు చేపట్టాలని.. మద్యాన్ని నేరుగా హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆ పోర్టల్ ద్వారా మద్యం ఆర్డర్ చేసి ఆన్‌లై‌న్‌లో నగదు చెల్లిస్తే నేరుగా మద్యాన్ని ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

‘సీఎస్‌ఎంసీఎల్ ఆన్‌లైన్’ పేరుతో మొబైల్ యాప్‌‌‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆన్‌లైన్ ఒక్కొక్కొరు గరిష్టంగా 5000 మి.లీ (5 లీటర్ల) మద్యాన్ని ఆర్డర్ చేయొచ్చు. డెలివరీ చార్జీల కింద మద్యం ధరకు అదనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ చేసి నగదు చెల్లించిన వెంటనే మద్యం ఇంటికే డెలివరీ చేస్తారు. స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.