
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కలవరపెడుతుంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ఇవాళ మరో 17 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వారికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి కూడా టెస్టులు చేశామని , వారందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
కాగా నిలోఫర్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 15వ తేదీ రాత్రి విధుల్లో పాల్గొన్న వారితో పాటు 16, 17 తేదీల్లో మూడు షిఫ్టుల్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ క్వారంటైన్‌కు వెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు.









