
కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో ఇప్పటి వరకు మొత్తం 82,940 కేసులు నమోదు కాగా భారత్‌లో అంతకుమించి కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 85,940కి చేరింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 3,970 మందికి కొత్తగా కరోనా సోకింది.
గత 24 గంటల్లో భారత్‌లో 103 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,752కి చేరింది.









