మే 03 వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావాలి – మోడీ

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ .. మొదట అంబేద్కర్ గురించి ప్రస్థావించారు. ఈ ప్రసంగంలో మోడీ ముఖానికి ఎరుపురంగు టవల్ చుట్టుకొని వచ్చి ప్రజలకు అభివందనం చేసి ప్రసంగాన్ని ప్రారంభించారు. కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

దేశంలో ఒక్క కేసు ప్రారంభం కాకముందే కఠిన చర్యలు చేపట్టాం. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుంది. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు. మే 3వ తేదీ వరకు ఇండ్లలో నుంచి ఎవరూ బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. అందరూ సహకరించాలని కోరారు.