Site icon TeluguMirchi.com

స్వదేశాని భారతీయులు .. 64 విమానాల్లో


కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది.

వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఈ నెల 7 నుంచి 13 వరకు స్వదేశానికి తీసుకొస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. మొత్తం 64 విమానాల్లో వారిని తీసుకొస్తామని తెలిపారు. 64 విమానాల్లో యూఏఈ -10, ఖతార్‌ -2, సౌదీ అరేబియా – 5, బ్రిటన్‌ – 7, సింగపూర్‌ – 5, అమెరికా – 7, ఫిలిప్పీన్స్‌ – 5, బంగ్లాదేశ్‌ – 7, బెహరైన్‌ -2, మలేసియా – 7, కువైట్‌ – 5, ఒమన్‌ -2 విమానాలు వెళ్లనున్నాయి.

Exit mobile version