
కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితి ఏర్పడింది. భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారిని భారత్ తీసుకువచ్చేందుకు కేంద్రం భారీ కార్యాచరణ రూపొందించింది.
వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఈ నెల 7 నుంచి 13 వరకు స్వదేశానికి తీసుకొస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. మొత్తం 64 విమానాల్లో వారిని తీసుకొస్తామని తెలిపారు. 64 విమానాల్లో యూఏఈ -10, ఖతార్ -2, సౌదీ అరేబియా – 5, బ్రిటన్ – 7, సింగపూర్ – 5, అమెరికా – 7, ఫిలిప్పీన్స్ – 5, బంగ్లాదేశ్ – 7, బెహరైన్ -2, మలేసియా – 7, కువైట్ – 5, ఒమన్ -2 విమానాలు వెళ్లనున్నాయి.









