
ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ స్థితిని ఇంకా పొడిగించడం ఎంతమాత్రం మంచిదికాదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే ఆకలి మరణాలు కొవిడ్-19ను మించిపోతాయన్నారు. పనిచేయగలిగే అవకాశం ఉన్న వారిని వీలైనంత త్వరగా ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడం మంచిదని సలహా ఇచ్చారు .
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో ఈ వైరస్ కారణంగా దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. దేశంలో ఏటా వేర్వేరు కారణాల వల్ల సుమారు 90 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. అందులో కాలుష్యం కారణంగానే నాలుగో వంతుమంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అదే సమయంలో కరోనా వల్ల గత రెండు నెలల్లో వెయ్యిమంది మరణించారని, దీనిపట్ల అంతగా ఆందోళన అవసరం లేదని చెప్పుకొచ్చారు.









