జూన్‌లో పరిస్థితి దారుణం

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6977 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

24గంటల్లో ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,38,845కి చేరింది. కాగా భారత్‌ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింత తీవ్రం కానుంది. జూన్‌లో పరిస్థితి దారుణంగా ఉండనుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.