భారత్‌లో పెరుగుతున్న కరోనా మరణాలు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. కొవిడ్‌ బాధితుల సంఖ్య 82 వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో 3,967 కొత్త కేసులు నమోదు కాగా, 100 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,649కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 81,970కి పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 27,919 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 51,401 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.