
ఆంధ్రప్రదేశ్లో కరోనాతో ఇవాళ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 33కి చేరింది. తాజాగా కర్నూలులో ఒకరు, నెల్లూరులో మరొకరు మృతి చెందినట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా గత 24 గంటల్లో 7902 శాంపిల్స్ ను పరీక్షిస్తే 60 మందికి కరోనా ఉన్నట్టుగా తేలిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన 1463 కేసుల్లో 1027 కేసులు యాక్టివ్ కేసులుగా ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకిన రోగులు 403 మంది ఇప్పటివరకు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.









