KindIndia NGO : పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు… విద్యార్థుల ఆరోగ్యానికి కైండ్ ఇండియా బాట

Kindindia1
సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ KindIndia సేవా కార్యక్రమాలు ప్రశంసనీయంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంలోనే లక్షలాది మందికి ఆహారం, తాగునీరు, దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలను అందిస్తూ ఈ సంస్థ విశేష గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా రోగులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులకు సహాయం చేయడంలో ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం.

ఈ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి వారం రెండు సార్లు 600 పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Kindindia2

అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రమైన తాగునీరు అందించేందుకు ఆర్వో (RO) వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాదిలోనే 100 ఆర్వో యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపడుతోంది.

ఇక దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సుమారు 10,000 మంది చిన్నపిల్లలు, వృద్ధులకు కొత్త బ్రాండెడ్ దుస్తులను అందించింది. వివిధ ఎన్జీవోలు, వృద్ధాశ్రమాల ద్వారా ఈ సహాయం అందిస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతోంది. అవసరాలను తీర్చడమే కాకుండా, గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇక మరో ముఖ్య కార్యక్రమంగా Kindwaves India Foundation ఆధ్వర్యంలో తిరుమల నగర్ HB కాలనీ, మౌలాలి ప్రాంతంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు Kunda Pratap ప్రారంభించారు. విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఆరోగ్యకరమైన మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్పర్సన్ సంతోష గారు, ప్రధానోపాధ్యాయులు జె. శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సౌకర్యాన్ని స్వాగతించారు.

“అన్నదానం మిన్న, వేసవిలో జలదానం మిన్న” అనే సందేశంతో ఈ సంస్థలు చేస్తున్న సేవలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తున్నాయి. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలు అందిస్తూ పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థలు పేర్కొన్నాయి.

మరిన్ని వివరాలకు లేదా సహాయం చేయాలనుకునే వారు kindindia.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Kindindia ro