
దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో అన్నట్లు సమాచారం. పరిస్థితులను సమీక్షించి మే 3 తర్వాత లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని సీఎంలతో ప్రధాని అన్నట్లు సమాచారం.
అయితే కొవిడ్ ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితి సమీక్షించి మినహాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ప్రణాళికలను తయారు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు. గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల వారీగా ఈ ప్రణాళికలు ఉండాలని అన్నట్లు సమాచారం.









