
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఫలితాలు ఇస్తుందని వెల్లడించింది కేంద్రం . ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 10 రోజులకోసారి కేసులు డబుల్ అవుతున్నాయని వెల్లడించింది. లాక్‌డౌన్ విధించడం వల్లే ఇవాళ కేసుల సంఖ్య 23 వేలు దగ్గర ఉందని, లేకుంటే ఆ సంఖ్య ఈ పాటికే 73వేలు దాటేదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.
ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరిందని చెప్పారు. ఇప్పటి వరకు 20.57 శాతం మంది అంటే 4,748 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారని చెప్పారు.









